ప్రభుత్వం ప్రతి గ్రామ అభివృద్ధిని క్రమం తప్పకుండా గమనించేందుకు ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చింది. దీనిని PAI – Panchayat Advancement Index అని అంటారు. ఇది పంచాయతీ స్థాయిలో అభివృద్ధిని కొలిచే ఒక డాష్‌బోర్డ్.
ఈ PAI ద్వారా, ప్రతి గ్రామ పంచాయతీని 9 ముఖ్య అంశాలపై మూల్యాంకనం చేసి, స్కోర్ ఇస్తారు. ఆ స్కోర్ ఆధారంగా ప్రతి పంచాయతీకి A+, A, B, C, D వంటి గ్రేడ్లు వేస్తారు.
Telangana లో PAI స్కోర్ వివరాలు
- మొత్తం గ్రామ పంచాయతీలు (GPs): 12,768
- డేటా వాలిడేషన్: 100% గ్రామాల డేటా అన్ని స్థాయిల్లో ధృవీకరించబడింది
- మొత్తం ఇండికేటర్లు (సూచికలు): 385 (508 నుండి)
- రాష్ట్ర మొత్తం స్కోర్: 84.09 (B గ్రేడ్)
స్కోర్ ఎలా ఇవ్వబడుతుంది? (9 అంశాలు/థీమ్స్)
- పేదరికం తగ్గించడం & ఉపాధి అవకాశాలు కల్పించడం
- ఆరోగ్య సంబంధిత సదుపాయాలు
- పిల్లల అభివృద్ధికి అనుకూల వాతావరణం
- నీటి సరఫరా & పారిశుద్ధ్యం
- శుభ్రత మరియు పచ్చదనం
- వసతులు (రహదారి, కరెంట్, డ్రైనేజ్)
- సామాజిక న్యాయం మరియు భద్రత
- పరిపాలన పద్ధతులు
- మహిళలకు అనుకూల వాతావరణం
ప్రతి అంశానికి విడిగా స్కోర్ ఉంటుంది. మొత్తం స్కోర్ వాటి సగటుతో వస్తుంది.
ఉత్తమ గ్రామ పంచాయతీలు – Top 10:
గ్రామం | జిల్లా | స్కోర్ |
---|---|---|
బర్నాపూర్ | కామారెడ్డి | 84.09 |
తిమ్మాపూర్ | కరీంనగర్ | 82.79 |
మునిపల్లి | నిజామాబాద్ | 81.29 |
మోర్తాడ్ | నిజామాబాద్ | 81.29 |
గుండంపల్లి | నిర్మల్ | 81.28 |
కల్వాలా | మహబూబాబాద్ | 80.82 |
చెన్నారం | నారాయణపేట | 80.80 |
మరియాపురం | వరంగల్ | 80.71 |
దేవెనిగూడ | మంచిర్యాల | 80.49 |
బండపల్లి | సిరిసిల్లా | 80.41 |
తక్కువ స్కోర్ వచ్చిన గ్రామాలు – Bottom 10:
గ్రామం | జిల్లా | స్కోర్ |
---|---|---|
కొండపాకగూడెం | నల్గొండ | 39.07 |
గుడతిపల్లి | సిద్ధిపేట | 39.39 |
శాకాపురం | నల్గొండ | 40.88 |
పూసలపహాడ్ | నల్గొండ | 40.90 |
వేంగన్నగూడెం | నల్గొండ | 40.97 |
జగ్గారం | భద్రాద్రి కొత్తగూడెం | 41.02 |
పాల్థి తండా | నల్గొండ | 41.80 |
ఇక్కుడా | నల్గొండ | 42.09 |
ముకుందపూర్ | వికారాబాద్ | 42.15 |
ముకుంద్ తండా | సంగారెడ్డి | 42.21 |
గ్రేడ్ వివరాలు:
- A+ గ్రేడ్: 0%
- A గ్రేడ్: 2.1%
- B గ్రేడ్: 79.1%
- C గ్రేడ్: 18.7%
- D గ్రేడ్: 0.1%
మీ గ్రామ స్కోర్ చూడాలంటే:
PAI యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ గ్రామం పేరు టైప్ చేసి తెలుసుకోవచ్చు.
లింక్: https://pdi.gov.in/PS/Public/SC.aspx