ఇందిరమ్మ ఇండ్లు కోసం ప్రత్యేక యాప్ సహాయంతో సర్వే చేయనున్న ప్రభుత్వం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

 

ఇందిరమ్మ ఇండ్లు  పథకానికి మొబైల్ యాప్ సిద్దం చేశారు . ఈ యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు.

 

 

 

మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది,

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నది. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. దీంట్లో దివ్యాంగులకు, ఆదివాసీలకు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు తెలిపారు. రెండో విడతలో ఇంటి స్థలం లేనివారికి అవకాశం కల్పించనున్నారు.

ప్రతీ మండల కేంద్రంలోనూ ఇందిరమ్మ మోడల్ హౌజ్ నిర్మాణం చేయనున్నారు .

ఇందిరమ్మ ఇండ్లను ప్రాధాన్యత క్రమంలో  అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల కేటాయింపు జరుగుతుందని ,ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌… ఈ క్రమంలో ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లను కేటాయిస్తారు .

తొలి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల కేటాయింపులో భాగంగా మొత్తంగా 4.50 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది.

ఆదివాసీలు, ఆదివాసీ తండాలు (ఐటీడీఏ తండాలకు) జనాభా ప్రాతిపదికన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను. ఇప్పుడు కేటాయించిన ఇండ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఇస్తామన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత గొప్పదైనప్పటికీ అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుందని. పేదవారికి అన్యాయం జరుగకూడదని. అందుకే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఏ ఒక్క ఇళ్లు కూడా అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తెచ్చామని ఈ సందర్భంగా వివరించారు.

ప్రజా పాలన లోని ఆరు గ్యారంటీ లలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లు గ్యారంటీ పతకం కోసం పేద ప్రజలు ఎప్పుడూ ఎప్పుడు అని వేచి చూస్తున్నారు, ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ల గ్యారంటీ అమలు కోసం విది విధానాలు తయారు చేస్తున్నది , దానిలో బాగంగ ప్రజా పాలన దరఖాస్తు లో ఇందిరమ్మ ఇండ్లు పథకం వద్ద ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలి అని కోరిన వారి దరఖాస్తుల వివరాలు యాప్ ద్వారా అదికారులకు ఇవ్వనున్నారు, యాప్ లో ఉన్నా దరకాస్తూ దారుల వద్దకు సర్వే అధికారులు వచ్చి  పూర్తి వివరాలు నమోదు చేసుకుంటారు.

మీ ప్రజాపలన దరకాస్తులో మీరు ఇందిరమ్మ ఇండ్లు పథకం వద్ద ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలి అని టిక్కు చేశారో లేదో ఒకసారి మీరు  దరకస్తూ చేసుకున్నపుడు మీకు ఇచ్చిన ప్రజాపాలన దరకాస్తూ రశీదు చూసుకోండి ,

ప్రజా పాలన దరకాస్తూ వివరాలు కోసం Praja Palana వెబ్ సైటు లో చూసుకోవచ్చు

 

 

సర్వే అధికారులు యాప్ ద్వారా నమోదు చేసుకునే వివరాలు / ప్రశ్నలు ఈ విదంగా ఉన్నాయి 

 

 

 

 

 

  • Applicant family availed house under any earlier Government

    Scheme?

  • Present Residential status (own / rent), type of Roof & Wall,

    capturing of 3 images

  • Applicant family is APL / BPL?

  • Whether land is available for construction of house? documents  ( D form patta, Sada Sale ,Regd Sale Deed ,GO 58 ,Possession certificate ,Property Tax receipt ,Electricity Bill ,Patadar Pass Boom (PPB)

  • No of years residing in the present city / town?

  • Whether applicant / family member belong to any of the

    following disadvantage groups?

    (Disabled, Orphan, Single Women, Widow, Transgender, Safai

    Karmachari, Natural Calamities / Manmade disasters, Road

    Widening Victims, landless agricultural labour, PVTGs.)

ఇందిరమ్మ ఇండ్లు కోసం ప్రత్యేక యాప్ సహాయంతో సర్వే చేయనున్న ప్రభుత్వం Read Post »