ఇందిరమ్మ ఇండ్లు కోసం ప్రత్యేక యాప్ సహాయంతో సర్వే చేయనున్న ప్రభుత్వం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. … Read more