ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం పూర్తి గైడ్ మీ కోసం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణం సంబంధించిన ప్లాన్ వివరాలు, స్థలం, గదులు, తలుపులు, కిటికీలు గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుంటాము,
ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకంలో భాగంగా అర్హత పొందిన లబ్ధిదారులకు అందించే ఈ ఇళ్ల నిర్మాణ పద్ధతి, నిర్మాణానికి అవసరమైన ప్లాన్, స్పెసిఫికేషన్లు, మరియు నిర్మాణ లక్షణాలను తెలుసుకోవడం ద్వారా లబ్ధిదారులకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్లాన్ వివరాలు
ఈ ఇళ్లను సాధారణంగా 400 చదరపు అడుగుల (Sq.ft.) స్థలంలో నిర్మస్తారు. అంటే 44.5 చదరపు గజాలు.
నిర్మాణ పరంగా ప్రధాన భాగాలు:
- హాల్: 9′-5″ x 10′-0″
- కిచెన్: 6′-9″ x 10′-0″
- బెడ్రూం: 12′-4″ x 10′-3″
- బాత్రూం: 3′-8″ x 5′-0″
- W.C: 3′-8″ x 4′-10″
నిర్మాణ విధానం
- ఫౌండేషన్: M25 గ్రేడ్ కాంక్రీటుతో (1:1:2) నిర్మిస్తారు.
- కాలమ్స్: 9″ x 9″ పరిమాణంలో 12mm స్టీల్ రాడ్లను ఉపయోగిస్తారు.
- బీమ్స్ & స్లాబ్: M20 గ్రేడ్ కాంక్రీటుతో (1:1.5:3) డిజైన్ చేస్తారు.
- గోడలు: 6″ ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మాణం.
- వెన్టిలేటర్స్: ఆర్.సి.సి. జాలీలు ఏర్పాటు చేస్తారు.
- ఫ్లోరింగ్: షాబాద్ స్టోన్ వేయడం జరుగుతుంది.
ఇళ్లు నిర్మాణ లక్షణాలు
- ప్లిన్త్ బీమ్: 9″ x 9″ పరిమాణంలో 12mm స్టీల్ రాడ్లతో తయారు చేస్తారు.
- ఫుటింగ్స్: 4′-6″ x 4′-6″ పరిమాణంలో M25 గ్రేడ్ బేస్ మెటీరియల్.
- కవరింగ్: బీమ్స్ – 25mm, స్లాబ్స్ – 20mm కాంక్రీట్ కవరింగ్ ఉంటుంది.
Plan Images :
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిర్వాహణ కోసం ప్రభుత్వం AI టెక్నాలజీ సహాయంతో App ని తయారు చేసి సర్వే చేసి అర్హులైన లబ్దిదారుల జాబితా తయారు చేసింది, గ్రామసభల ద్వారా తుది జాబితా సిద్దం చేశారు,
ప్రస్తుతం మండలానికి ఒక గ్రామ పంచాయతీ ని ఎంపిక చేసి pilot project గా తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ఏర్పాటు చేస్తున్నారు
వీటి కోసం App లో మొదటగా Markout & Capture Geo coordinates చేస్తారు.
తరువాత 4 స్థాయిల్లో ఫొటోలు తీస్తారు నాలుగు విడతలుగా డబ్బులు చెల్లిస్తారు :
- Basement Level. – 1 లక్ష
- Roof level with Brick work. – 1 లక్ష
- RCC slab laid level. – 2 లక్షలు
- Final bill Plastering, Door shutters fixing, colour washing – 1 లక్ష
ఇటీవల జరిగిన వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రాజెక్టు పనులపై సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది అత్యంత ప్రాధాన్యత పథకంగా తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా.. బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి చేసిన ఇళ్ల లబ్ధిదారులకు అత్యంత వేగంగా డబ్బులను చెల్లించాలన్నారు
బేస్మెంట్ స్థాయిలో పూర్తయిన ఇళ్లకు తొలి విడతగా రూ.1 లక్ష చెల్లింపులు త్వరగా జరపాలని అధికారులను ఆదేశించా రు
ముగింపు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రణాళికకు అనుగుణంగా మీకు అవసరమైన ప్రాథమిక అవగాహన కలిగించే ప్రయత్నం చేసాము. ఈ వివరాలు మీరు మీ ఇంటి నిర్మాణం చేసుకోవడానికి సహాయపడుతుంది.
NOTE : మీరు ఇంటి నిర్మాణం చేయడానికి ముందు మీకు సంబందించిన మంజూరు కాగితాలు మరియు అధికారిక ప్లాన్ లను అధికారుల నుండి తీసుకున్నాక మాత్రమే మొదలు పెట్టాలి.
For Latest updates and job alerts please follow my channel https://whatsapp.com/channel/0029Vaxi1ZzLikgCifR1el10