సూర్య గ్రహణ వివరాలు
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలో పూర్తిగా రావటం లేధు, దీనివల్ల సూర్యుడి ఒక వైపు కొద్ది భాగం మాత్రమే కనిపించకుండా ఉంటుంది. ఈ గ్రహణాన్ని భారతదేశంలో చూడలేరు. అందువల్ల మన దేశానికి ఇది ప్రభావం కలిగించదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం కావడంతో, భారతదేశంపై సూర్యకాంతి సాధారణంగానే ఉంటుంది.
భూమి, సూర్యుడి మధ్య చంద్రుడు వచ్చి, సూర్యుడిని పూర్తిగా కప్పివేయకుండా కొంత భాగాన్ని మాత్రమే కప్పివేస్తే, దానిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు.
చంద్రుడు భూమిపై పాక్షికంగా కప్పి వేస్తుంది కాబట్టి, గ్రహణ సమయంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సూర్యకాంతి తగ్గిపోతుంది.
గ్రహణ తేదీ : మార్చి 29, 2025
గ్రహణ రకం : పాక్షిక సూర్యగ్రహణం (Partial Solar Eclipse)
ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు
గ్రహణం కనిపించే ప్రాంతాలు: ఉత్తర అమెరికా, కెనడా, యూరప్, ఉత్తర ఆసియా
గ్రహణ సమయాలు (IST – భారత కాలమానం ప్రకారం)
🔸 ప్రారంభం: మధ్యాహ్నం 2:20
🔸 గరిష్ఠ స్థాయి: సాయంత్రం 4:15
🔸 ముగింపు: సాయంత్రం 6:16
భారతదేశంలో సూతక కాలం వర్తిస్తుందా?
సాధారణంగా సూర్య గ్రహణానికి ముందు 12 గంటలు మరియు చంద్ర గ్రహణానికి ముందు 9 గంటలు సూతక కాలం అమల్లో ఉంటుంది. అయితే, ఈ గ్రహణం భారతదేశంలో కనబడకపోవడం వల్ల సూతక కాలం వర్తించదు.
ఈ సూర్యగ్రహణం బెర్ముడా, బార్బడోస్, డెన్మార్క్, ఆస్ట్రియా, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, ఫిన్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, ఐర్లాండ్, మొరాకో, గ్రీన్లాండ్, కెనడా తూర్పు భాగం, లిథువేనియా, హాలండ్, పోర్చుగల్, ఉత్తర రష్యా, స్పెయిన్, సురినామ్, స్వీడన్, పోలాండ్, పోర్చుగల్, నార్వే, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సూర్యగ్రహణం మీన రాశి, ఉత్తర భాద్రపద నక్షత్రంలో సంభవిస్తుంది. ఈ సమయంలో సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు మీన రాశిలో ఉంటారు, ఇది జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
గ్రహణం సమయంలో పూజలు, శుభకార్యాలు చేయకూడదు, ఆహారం కూడా తీసుకోకూడదు. గ్రహణం సమయంలో ఉపనయనం అయిన వారు గాయత్రీ జపం చేయడం, సూర్యారాధన చేయడం, రాహు గ్రహ జపం చేయడం మరియు దుర్గాదేవిని ఆరాధించడం మంచిదని సూచిస్తున్నారు.
భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించకపోవడంతో, ఇక్కడ సూతక కాలం వర్తించదు. అయినప్పటికీ, జ్యోతిష్య నిపుణులు సూచించిన విధంగా, గ్రహణ సమయంలో సూర్యారాధన, రాహు గ్రహ జపం, దుర్గాదేవి ఆరాధన చేయడం శుభప్రదంగా ఉంటుంది.
సూర్య గ్రహణ ప్రభావం మరియు జాగ్రత్తలు
భక్తులకు: గ్రహణ సమయంలో పూజలు, దేవాలయ సందర్శనలు, భోజనం తినడం వంటివి మానుకోవడం హిందూ సంప్రదాయ ప్రకారం సాధారణం. కానీ, ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోవడం వల్ల ఈ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.
గర్భిణీ స్త్రీలు: గ్రహణ సమయంలో బయటకు వెళ్లరాదు, పదార్థాలను కోయరాదు, నిపుణుల సూచనల ప్రకారం మానసిక ప్రశాంతతను పాటించాలి.
కనిపించే ప్రాంతాల్లో ఉన్నవారికి: సూర్యగ్రహణాన్ని కళ్ళతో నేరుగా చూడకూడదు. సురక్షితమైన సోలార్ గ్లాసెస్ లేదా ఫిల్టర్ గ్లాసెస్ ఉపయోగించాలి.